కొండ్రికర్ల సర్పంచ్‌గా రాజేశ్వర్ గెలుపు
JGL: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా గంట రాజేశ్వర్ తన సమీప ప్రత్యర్థిపై 143 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తన విజయానికి సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.