ప్రజా దర్బార్‌లో పాల్గొన్న నారా భువనేశ్వరి
CTR: శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు.