ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం రాజాపూర్ మండలం చొక్కంపేట గ్రామంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. అందులో భాగంగానే చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈ చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకలు అన్నారు.