ప్రమాదాలకు నిలయంగా స్పీడ్ బ్రేకర్లు

NLR: ఉదయగిరి వైఎస్సార్ సర్కిల్ వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉదయగిరి నుంచి నెల్లూరు వైపు, కావలి నుంచి ఉదయగిరి వైపు స్పీడ్ బ్రేకర్లను అధికారులు ఏర్పాటు చేసి లైనింగ్ (బార్డర్) వేయకపోవడంతో ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి.