ఎక్కడికక్కడే నిలిచిపోయిన LNG ట్యాంకర్లు
ఇరాన్ దాడులతో ఖతార్‌లోని LNG ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఒకవైపు హర్మూజ్ జలసంధి మూసివేత, మరోవైపు LNG ఉత్పత్తి లేకపోవడంతో పదుల కొద్ది ఖతార్ LNG ట్యాంకర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. భారత్, సింగపూర్, శ్రీలంక తీరాలతోపాటు మలక్కా జలసంధి ప్రాంతంలోనూ ఈ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు కెప్లర్ వెల్లడించింది. ఈ నౌకల్లో ఏ ఒక్క దాంట్లోనూ LNG లేదని తెలిపింది.