'ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయం'

BPT: రేపల్లె మండలం బేతపూడి గ్రామంలో 40 లక్షల రూపాయల MGNREGS నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని టీడీపీ నేత అనగాని శివప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సచివాలయాల ద్వారా గ్రామ ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.