'క్రీడా నైపుణ్యాలను గుర్తించాలి'

MNCL: విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వాలంటీర్లు గుర్తించాలని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఎంఈఓ విజయ్ కుమార్ సూచించారు. వేసవి నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వాలంటీర్లకు శనివారం జన్నారం మండల కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో శిక్షణ తరగతులను నిర్వహించి పలు క్రీడా అంశాలపై వారికి అవగాహన కల్పించారు.