రేపు పులివెందులలో విద్యుత్ లోక్ అదాలత్
KDP: పులివెందుల డివిజన్‌లో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. నియోజకవర్గంలోని విద్యుత్ సమస్యలకు సంబంధించిన సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.