గోదావరిలో యువకుడి గల్లంతు
W.G: యలమంచిలి మండలం కంచుస్థంభంపాలెంకు చెందిన టీడీపీ కార్యకర్త చిట్టినీడి సాయి (32) బుధవారం గోదావరిలో గల్లంతయ్యారు. అదే గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఆయన, ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. గోదావరి గట్టు వద్ద ఆయన సైకిల్ మాత్రమే లభ్యమైందని మండల టీడీపీ అధ్యక్షుడు పెద్దిరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.