VIDEO: ఎదురెదురుగా ఢీకొన్న బైకులు.. ఇద్దరికి గాయాలు
KNR: గంగాధర మండల కేంద్రంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మండలం నుంచి మధురానగర్ వైపు వెళ్తున్న బైక్, అక్కడి నుంచి వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టింది. అతివేగం లేదా అజాగ్రత్త కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.