వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మందికి గాయాలు

WGL: జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో తీవ్ర ఆందోళన నెలకొంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.