'హోంగార్డుల సేవలు మరువలేనివి'
KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో శనివారం 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.