బీజేపీ గెలుపు కూసుమంచిలో నాయకుల సంబరాలు
KMM: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని కూసుమంచిలో ఇవాళ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలతో కలిసి టపాకాయలు పేల్చి ఆనందం పంచుకున్నారు.