బైక్ ఢీకొని మహిళ మృతి

బైక్ ఢీకొని మహిళ మృతి

KMR: తాడ్వాయి మండలంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ గ్రామానికి చెందిన సమ్మక్క వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో సమ్మక్క తలకు తీవ్ర గాయం కాగా.. 108లో ములుగు ఆసుపత్రికి తరలించారు. సమ్మక్క చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు.