నేడు పలు మండలాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు పలు మండలాల్లో పర్యటించనున్న ఎమ్మెల్యే

VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇవాళ పలు మండలాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎల్. కోట మండలం రంగాపురంలోని కృష్ణమ్మ పండగ మహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 11 గంటలకు రంగారాయపురం, రెల్లిగైరమ్మపేట గ్రామాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు వేపాడ మండలంలో గౌరీ పరమేశ్వరి పండగ మహోత్సవంలో పాల్గొననున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు.