VIDEO: గణేష్ ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

NRML భైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ గణేష్ ఉత్సవాల నిర్వాహాణపై సమీక్ష నిర్వహించారు. ఈ ఉత్సవాలపై పలువురు ప్రతినిధులతో ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎస్పీ అవినాష్ కుమార్, కమిషనర్ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.