VIDEO: కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు తీవ్ర గాయాలు
MLG: మేడారంలో దర్శనానికి వచ్చిన భక్తులు నిర్లక్ష్యంగా కొబ్బరికాయలు విసరడంతో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. కొబ్బరికాయలు తగలడంతో 10మంది భక్తులకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి. కొబ్బరికాయలు విసరవద్దని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు భక్తులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగింది. రెస్క్యూ టీమ్ గాయపడిన భక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.