వ్యక్తి సూసైడ్.. అప్పుల భారమే కారణం

మన్యం: బలిజిపేట మండలం గంగాపురంలో అప్పుల భారంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సింహాచలం వివరాల ప్రకారం.. ఇటుక బట్టి నిర్వహిస్తున్న రవి అప్పులు ఎక్కువగా చేశాడు. వీటిని సమయానికి తీర్చలేక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స కోసం విజయనగరం తరలించగా బుధవారం మృతిచెందాడు.