ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎయిడెడ్ పాఠశాలలో శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ.. 2012లో అమలైన ఈ చట్టం 18 ఏళ్లలోపు పిల్లలకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.