ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు నోటీసులు జారీ

ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు నోటీసులు జారీ

BDK: అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో ఈరోజు ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ కన్నా ముందుగా దుకాణాలు, కాంప్లెక్సులు లేదా ఇతర నిర్మాణాలు చేసుకున్న వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోపు ఖాళీ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు నోటీసులో స్పష్టం చేశారు.