జహీరాబాద్‌లో కొండముచ్చుల బెడద

జహీరాబాద్‌లో  కొండముచ్చుల బెడద

SRD: జహీరాబాద్ పట్టణంలో కొండముచ్చుల బెడద ఎక్కువైంది. గత రెండు రోజులుగా జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్, గాంధీనగర్లలో కొండముచ్చు నలుగురిని గాయపరిచింది. క్షతగాత్రులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.