భూవివాదం ఘర్షణలో 10 మంది అరెస్ట్

భూవివాదం ఘర్షణలో 10 మంది అరెస్ట్

NTR: రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరులో గత నెల 25న తలెత్తిన భూవివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఘర్షణకు బాధ్యులైన 10 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు CI కిషోర్ బాబు, SI శ్రీను వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.