బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో 46 ప్రతులు దగ్ధం

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో 46 ప్రతులు దగ్ధం

MNCL: స్థానిక సంస్థల్లో బీసీలకు వ్యతిరేకంగా విడుదల చేసిన రిజర్వేషన్ల జీవో 46 రద్దు చేయాలని బీసీ మహిళా జేఏసీ జిల్లా కన్వీనర్ పేరం అలేఖ్య, బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ వడ్డేపల్లి మనోహర్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాలలో జీవో ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. స్థానిక సంస్థలో బీసీలను రాజకీయంగా అణగతొక్కడానికి కుట్రలు చేస్తున్నారని తెలిపారు.