VIDEO: రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
SKLM: బలివాడ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.