రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత..!
MDCL: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. అన్ని గ్రామాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.