కోరికలు తీర్చే కుండలేశ్వర స్వామి.. ఎక్కడో తెలుసా?
కాశీ విశ్వనాథునితో సమానమైన ప్రాముఖ్యత కలిగిన కుండలేశ్వర స్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా గోదావరి ఒడ్డున ఉంది. స్కంద పురాణం ప్రకారం కాశీ యాత్రకు వెళ్లేవారు ముందుగా ఇక్కడ స్నానం చేసి స్వామిని దర్శించాలి. ఇక్కడి స్వయంభూ శివలింగం చెవి కుండలం ఆకారంలో ఉండటంతో ‘కుండలేశ్వరుడు’ అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.