నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్

నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్

HYD: నగరవాసులకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. నవంబర్ 3 నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అన్ని లైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి లాస్ట్ ట్రైన్ రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందన్నారు. అయితే ప్రస్తుతం మెట్రో సేవలు ఆదివారం ఉ. 7 గం.లకు ప్రారంభం అవుతుండగా, నవంబర్ 3 నుంచి ఆదివారం కూడా 6 గంటలకే ప్రారంభం కానున్నాయి.