రేపు ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్ తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరై మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.