సంగమేశ్వర స్వామికి అమావాస్య పూజలు

SRD: దక్షిణ కాశీగా పిలవబడుతున్న ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో స్వామివారికి నేడు అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రావణ మాసం చివరి శనివారం పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు గంగాజలంతో అభిషేకం చేశారు. తమ ఆరాధ్య దేవున్ని దర్శించేందుకు భక్తులు ఈ తెల్లవారుజాము నుంచి తరలివస్తున్నారు.