డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

MDCL: మల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాబానగర్ కాలనీలో రూ.9.5 లక్షలతో, గ్రీన్ హిల్స్ కాలనీలో రూ.13 లక్షలతో భూగర్భ డ్రైనేజి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజలు పాల్గొని అభివృద్ధి కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు.