భర్త ఆరోగ్యం కోసం పుస్తెలు అమ్మారు.. అయినా..!

భర్త ఆరోగ్యం కోసం పుస్తెలు అమ్మారు.. అయినా..!

తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పలమనేరుకు చెందిన శ్రీనివాస్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. అయితే, ఆ మృతదేహాన్ని అడ్డుపెట్టుకుని ఇప్పటికే రూ.3 లక్షలు వసూలు చేశారు. భార్య, తల్లి పుస్తెలు తాకట్టు పెట్టి డబ్బు చెల్లించారు. ఇంకా, రూ.45 వేలు చెల్లించాలని, లేకపోతే మృతదేహం ఇవ్వమంటున్నారని సదరు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.