రామాలయంలో సత్యనారాయణస్వామి వ్రతాలు
NGKL: కార్తీకపౌర్ణమి సందర్భంగా బుధవారం పట్టణంలోని రాంనగర్ కాలనీలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతాయని అర్చకులు వరదరాజన్ అయ్యాంగారు తెలిపారు. ఉదయం 10:30గంటలకు నిర్వహించే వ్రతాలలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ఉచిత సామూహిక భోజనాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.