ఢిల్లీని వీడని కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంకా కంటిన్యూ అవుతోంది. పొగమంచు కారణంగా గాలి నాణ్యత పడిపోయింది. ఈరోజు సిటీలో సగటు AQI 268 పాయింట్లుగా నమోదైంది. ఇక జహంగీర్‌పురిలో అయితే పరిస్థితి మరీ దారుణం.. అక్కడ అత్యధికంగా 324 పాయింట్లు రికార్డ్ అయ్యింది. గాలి నాణ్యత క్షీణించడంతో.. బయటకు రావాలంటేనే ఢిల్లీ జనం మాస్కులు వెతుక్కుంటున్నారు.