'కులాంతర వివాహాలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి'
హన్మకొండ పట్టణ కేంద్రంలోని రామ్‌నగర్‌లో ఇవాళ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు భద్రత లేకుండా పోయిందని, వారి రక్షణకు తక్షణమే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. KVPS నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు.