నేటి నుంచి మద్దిమడుగు అంజన్న బ్రహ్మోత్సవాలు
NGKL: అమ్రాబాద్ మండలం, మద్దిమడుగులో నేటి నుంచి అంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 2న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, 3న సీతారాముల కళ్యాణం, హనుమాన్ పడిపూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ముఖ్య అతిథిగా రామానుజ చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.