సీనియర్ కాంగ్రెస్ నేత మృతి, పలువురి సంతాపం
NLG: హాలియా పురపాలిక, 4 వ వార్డ్‌లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్లకొండ యాదగిరి ఆకస్మికంగా మృతి చెందాడు. విషయం తెలుసుకొని అనుముల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కుందూరు వెంకటరెడ్డి వారి నివాసానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్, మొహిద్దిన్ నసీరుద్దీన్ ఉన్నారు.