కడప రైల్వేస్టేషన్‌లో మాక్ డ్రిల్ నిర్వహణ

KDP: కడప రైల్వే స్టేషన్ పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగితే తీసుకునే చర్యలపై డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ అదితి సింగ్, తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.