బేబీ పౌడర్ కేసులో జాన్సన్‌కు భారీ షాక్
బేబీ పౌడర్ కేసులో జాన్సన్‌కు భారీ షాక్ తగిలింది. బేబీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు 40 మిలియన్లు పరిహారంగా చెల్లించాలని కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. దాదాపు 4 దశాబ్దాలుగా పౌడర్ ఉపయోగించడంతోనే తమకు క్యాన్సర్ వచ్చిందని, దీనివల్ల కీమోథెరపీ చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు.