ఫాతిమా మాత ఉత్సవాలను ప్రారంభించిన బిషప్ బాల

HNK: కాజీపేట మండలం ఫాతిమా నగర్ కేంద్రంలో మంగళవారం రాత్రి ఫాతిమా మాత ఉత్సవాలను బిషప్ డాక్టర్ ఉడుముల బాల జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు జరుగు ఫాతిమా మాత ఉత్సవాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఫాతిమా మాతను దర్శించుకుంటున్నారు.