ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: బీజేపీ

GDWL: రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇచ్చిన ‘చలో సెక్రటేరియట్’ పిలుపులో భాగంగా అలంపూర్ మండలం బీజేపీ నాయకులను స్థానిక పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గోంగోల ఈశ్వర్ మాట్లాడుతూ.. ముందస్తు అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.