రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
KKD: సామర్లకోట పిఠాపురం రోడ్డు సాయిబాబా గుడి సమీపన శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సామర్లకోట ఉప్పు వారి వీధి చెందిన చల్లా బత్తుల రాజు (50) అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం తనకు తాను పడిపోయాడా, లేదా ఎవరైనా వాహనంతో ఢీకొట్టి వెళ్లిపోయారా, ఏ విధంగా ప్రమాదం జరిగిందనే సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.