'అర్ధరాత్రి వరకు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచరాదు'

'అర్ధరాత్రి వరకు వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచరాదు'

ADB: అర్ధరాత్రి వరకు దుకాణ వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచరాదని వన్ టౌన్ CI సునీల్ కుమార్ శుక్రవారం తెలియజేశారు. రాత్రి 11 తర్వాత అత్యవసర సేవలు తప్ప, వ్యాపార సముదాయాలు మూసివేయాలన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు. పోలీసు విధులకు ఆటంకపరచిన షేక్ హబీబ్ పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.