కుక్కల దాడిలో చిరుత కూన మృతి..!

కుక్కల దాడిలో చిరుత కూన మృతి..!

KDP: దువ్వూరు మండలం చిన్నబాకరపురం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి వచ్చిన ఒక చిరుత పిల్లపై గ్రామంలో తిరిగే కుక్కలు గుంపుగా దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి మృతి చెందింది. గమనించిన స్థానిక రైతులు వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.