'గ్రామ పరిశుభ్రత ప్రజల సమిష్టి బాధ్యత'
కృష్ణా: గ్రామ పరిశుభ్రత ప్రజల సమిష్టి బాధ్యత అని రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ ఛైర్మన్ డాక్టర్ డీ.ఆర్.కే ప్రసాద్ అన్నారు. శుక్రవారం చల్లపల్లి బస్టాండ్ ఆవరణలో 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ కార్యకర్తలు పిచ్చి మొక్కలు, చెత్త తొలగించారు. ప్రతి ఒక్కరూ తమ వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. సమిష్టి కృషితోనే స్వచ్ఛత సాధ్యం అన్నారు.