VIDEO: టాటా ఏస్ ఢీకుని యువకుడుకి తీవ్రగాయాలు
అన్నమయ్య: మదనపల్లిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుల్లా నాయక్ (28) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బెంగుళూరు రోడ్ నక్కలదిన్నె తండాకు చెందిన నాయక్ సొంత పనిమీద బైకుపై నిమ్మనపల్లి రోడ్ సర్కిల్ వద్దకు వెళ్లగా, వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.