లవర్స్‌కి స్లీపర్ సీట్ ట్విస్ట్
కృష్ణా: స్లీపర్ సీట్లో పక్కపక్కనే ప్రయాణించాలన్న కోరిక చివరకు దాడికి దారి తీసింది. HYD నుంచి బందరు వస్తున్న యువకుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో, మహిళల పేర్లతో బుక్ చేశాడు. ఆ సీట్లలో యువకుడిని కూర్చోనివ్వలేమని డ్రైవర్ చెప్పడంతో ప్రేమజంటతో వాగ్వాదం జరిగింది. ప్రయాణం ముగిసే సమయంలో చిలకలపూడి సెంటర్ వద్ద యువకుడు డ్రైవర్‌పై దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి.