శావల్యాపురంలో ఫించన్లు మంజూరు

శావల్యాపురంలో ఫించన్లు మంజూరు

PLD: శావల్యాపురం మండలంలో మొత్తం 5,821 మంది లబ్ధిదారులకు ఈ నెల సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సీతారామయ్య తెలిపారు. ఆగస్టు నెలకు గాను కొత్తగా 11 పింఛన్లు మంజూరయ్యాయని, దీంతో పాటు స్పౌజ్ పింఛన్లు కూడా వచ్చాయని పేర్కొన్నారు. మండలంలో మొత్తం రూ. 2.54 కోట్ల పింఛను నగదును పంపిణీ చేయనున్నామని తెలిపారు.