పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల సమీపంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, ఎప్పుడు రైతుల మేలు కోరుతుందన్నారు.