ఈ నెల 23న చలో ఉట్నూర్
ADB: ఈ నెల 23వ తేదీన 'చలో ఉట్నూర్'ను ఆదివాసీలు విజయవంతం చేయాలని గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ సార్మేడి మెస్రం దుర్గు పటేల్ పిలుపునిచ్చారు. ఆయన ఇవాళ ఉట్నూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 30 ఏళ్ళ నుంచి 'ఆదివాసీ బచావో-లంబాడా హటావో' అనే నినాదంతో పోరాటాలు చేస్తున్నామని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలన్నారు.