బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సోకేసు నమోదు

బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సోకేసు నమోదు

కృష్ణా: కోడూరులో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వరికూటి వేణు అనే వ్యక్తి, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించగా, భయంతో బాలిక బయటకు పరుగెత్తింది. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో పెద్దలు రంగ ప్రవేశం చేశారు. అయితే, 2 రోజుల పాటు విషయం బయటకు రాకుండా చూసిన పెద్దలు, చివరికి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.